చిలుకూరు: 'ఎకరానికి 40 వేల నష్ట పరిహారాన్ని చెల్లించాలి'

తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ. 40,000 నష్ట పరిహారం చెల్లించాలని చిలుకూరు మండల పార్టీ అధ్యక్షుడు అక్కనపల్లి జానకి రామాచారి అన్నారు. ఆదివారం చిలుకూరు మండలం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తుఫాను తాకిడికి గురై నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. ప్రభుత్వం వెంటనే అధికారులచే పంట నష్టం అంచనా వేయించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాంబాబు, బట్టు శివాజీ, జానిమియా, అచ్చయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్