కోదాడ మండలంలో 16 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ రిజర్వేషన్ వివరాలను ఆర్డీవో సీహెచ్ సూర్యనారాయణ వెల్లడించారు. ఎస్టీ జనరల్ 1, ఎస్సీ మహిళ 1, ఎస్సీ జనరల్ 2, బీసీ మహిళ 3, బీసీ జనరల్ 4, రిజర్వ్డ్ మహిళ 2, అన్ రిజర్వ్డ్ జనరల్ 3 స్థానాలను కేటాయించారు. ఈ రిజర్వేషన్ల మార్పుతో పలు గ్రామాల్లో సర్పంచ్ పదవిపై ఆశలు పెట్టుకున్నవారు నిరాశకు గురవుతున్నారు.