కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ విద్యార్థులు, తల్లిదండ్రులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మ ఆటపాటలతో కళాశాల ప్రాంగణాన్ని మారుమోగించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. గాంధీ, డైరెక్టర్ డా. నాగార్జున రావు, హెచ్‌ఓడీలు, అధ్యాపకులు పాల్గొన్నారు.