కోదాడలో వినియోగదారుల దినోత్సవం సందర్భంగా విద్యుత్ సమస్యలపై నిర్వహించిన ఫోరంలో, విద్యుత్ శాఖ ఏడిఈ వెంకన్న వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సరఫరా అందిస్తామని హామీ ఇచ్చారు. కోదాడ టౌన్, రూరల్, మేళ్లచెరువు, చిలుకూరు, చింతలపాలెం మండలాల నుండి వందమంది వినియోగదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా, పలు సమస్యలను వెంటనే పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ నరసింహనాయక్ కూడా పాల్గొన్నారు.