కోదాడ రూరల్ పోలీసులు శుక్రవారం గుడిబండ నుండి కాపుగల్లు రోడ్డు వరకు రన్ ఫర్ యూనిటీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ ప్రతాప్ మాట్లాడుతూ, ఉక్కు మనిషిగా బిరుదు పొందిన స్వాతంత్ర్య సమరయోధుడు వల్లభాయ్ పటేల్ ఆశయాలను సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సై గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి, చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, తూమాటి నాగిరెడ్డి, నరసింహారెడ్డి, రాధాకృష్ణ పాల్గొన్నారు.