కోదాడ: రైతులను, కౌలు రైతులను ఆదుకోవాలి

కోదాడ మండలం పరిధిలోని గ్రామాల్లో మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన వరి పొలాలను బీఎస్పీ కోదాడ నియోజకవర్గం ఇంచార్జి నూకల గోపాలస్వామి యాదవ్ పరిశీలించారు. కన్నీరుమున్నీరవుతున్న రైతులకు ఆయన ఓదార్పునిచ్చారు. రైతుల దయనీయ పరిస్థితిని అర్థం చేసుకొని, వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోదాడ అధ్యక్షుడు కాంపటి వీరస్వామి, రమావత్ జాను, లింగయ్య, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్