కోదాడ: ఘనంగా మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి జన్మదిన వేడుకలు

కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు జన్మదిన వేడుకలు బుధవారం కోదాడలోని ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ సర్పంచి ఎర్నేని వెంకటరత్నం బాబు, వేనేపల్లి చందర్రావును శాలువాతో సత్కరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చందర్రావు, సాదాసీదా వ్యక్తిత్వంతో అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్