కోదాడలో డీసీసీబీ మాజీ ఛైర్మన్ ముత్తవరపు పాండురంగరావు జన్మదినం సందర్భంగా, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చంద్రరావు, పాండురంగరావు దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శేషు, కాంగ్రెస్ మండల పార్టీ ప్రెసిడెంట్ వరప్రసాద్ రెడ్డి, వేనేపల్లి శ్రీనివాసరావు, రావేళ్ళ సీతారామయ్య, పబ్లిక్ క్లబ్ సెక్రటరీ బొల్లు రాంబాబు, కొమరగిరి రంగారావు, మాజీ ఎంపీపీ మల్లెల బ్రమ్మయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. జన్మదినం సందర్భంగా జరిగిన ఈ సన్మాన కార్యక్రమం స్థానికంగా చర్చనీయాంశమైంది.