కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్, శుక్రవారం కోదాడ మండలం గణపవరం గ్రామంలో గుండెపోటుతో మృతి చెందిన నామ ముత్తమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె కుమారుడు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నామా నరసింహారావుకు ఎమ్మెల్యే ప్రగాఢ సానుభూతి తెలియజేసి, మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ నారాయణ రెడ్డి, ఇర్ల సీతారాం రెడ్డి, నరపరెడ్డి, సుమన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.