కార్మికులకు సీఐటీయూ అండగా నిలుస్తుందని, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతుందని జిల్లా కోశాధికారి కోటగిరి వెంకట్ నారాయణ అన్నారు. బుధవారం కోదాడలో జరిగిన సీఐటీయూ మహాసభలో ఆయన మాట్లాడుతూ, సీఐటీయూ పోరాటాల వల్లే కార్మికుల సమస్యలు పరిష్కారమవుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా కోదాడ పట్టణ సీఐటీయూ నూతన కన్వీనర్‌గా ఎం. ముత్యాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు.