కోదాడ కెఆర్ ఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రమణారెడ్డి విద్యార్థులకు జాతీయ నాయకుల జీవిత చరిత్రలను అధ్యయనం చేయాలని సూచించారు. శుక్రవారం కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ విభాగం నిర్వహించిన వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, స్వతంత్ర సమర యోధుడు పటేల్ దేశ సమగ్రతకు చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వేముల వెంకటేశ్వర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.