కోదాడ: పత్తి రత్తయ్య మృతి బాధాకరం

కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పందిరి నాగిరెడ్డి, వాసవి క్లబ్ కోదాడ అధ్యక్షులు సేకు శ్రీనివాసరావు లు ఆర్య వైశ్య నాయకుడు పత్తి రత్తయ్య మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం కోదాడలో మృతి చెందిన రత్తయ్య మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్యులు ఉప్పల సత్యనారాయణ, హరిబాబు, పత్తి నరేందర్, ఓరుగంటి పాండు, సామాజిక ఉద్యమ కారుడు వేమూరి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్