కోదాడ: తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు

కోదాడకు చెందిన భూక్య వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మంగళవారం, 02వ తేదీన మధ్యాహ్నం తమ్మర కాలువ వద్ద గేదెలు మేపడానికి వెళ్లి సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో అతని కుమారుడు భూక్య నాగరాజు కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేకపోవడంతో, ఆయన కాలువలో పడిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు మాయమైన వ్యక్తి కేసు నమోదు చేసి, రెస్క్యూ టీమ్ తో గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం తెలిసిన వారు 8712686009 కు సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్