కూచిపూడిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు బొలిశెట్టి కృష్ణయ్య, ధర్మరక్షణతోనే సమాజ సంక్షేమం సాధ్యమని అన్నారు. బుధవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న భవాని యూత్ సభ్యులను అభినందించారు. అనంతరం అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.