కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పందిరి నాగిరెడ్డి, సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లం ప్రభాకర్ రెడ్డిలు నామా ముత్తమ్మ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోమవారం కోదాడ మండలం గణపవరం గ్రామంలో నామా ప్రధాన కార్యదర్శి నామా నరసింహారావు తల్లి ముత్తమ్మ సంతాప సభలో వారు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జాబిశెట్టి చంద్రమౌళి, పార సీతయ్య, ఇర్ల నారపరెడ్డి, యంయస్ విద్యా సంస్థల సీ ఈ వో యస్ యస్ రావు తదితరులు పాల్గొన్నారు.