కోదాడ ఆర్డిఓ సిహెచ్ సూర్యనారాయణ మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం కార్యకర్తలు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవాలని సూచించారు. సోమవారం కోదాడ ఆర్డీవో కార్యాలయంలో సమాచార హక్కు చట్టం వారోత్సవాల సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సమాచార హక్కు చట్టం వల్ల అధికారుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు వికాస సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి చేకూరి శివ, మజాహర్ కూడా పాల్గొన్నారు.