కోదాడ: మాజీ మునిసిపల్ ఛైర్మన్ సామినేనిప్రమీల కుటుంబలో విషాదం

కోదాడ పరిధిలోని తమ్మరబండపాలెంకు చెందిన స్వర్గీయ సామినేని వెంకటేశ్వర్లు ధర్మపత్ని, సామినేని రమేష్, మాజీ కౌన్సిలర్ నరేష్‌ల తల్లి సామినేని రాధమ్మ శనివారం రాత్రి 11 గంటలకు కన్నుమూశారు. కోదాడ మాజీ మునిసిపల్ ఛైర్మన్ సామినేని ప్రమీల గారికి రాధమ్మ స్వయానా అత్తగారు. రాజకీయంగా పేరున్న కుటుంబానికి చెందిన రాధమ్మ మృతి పట్ల పలు రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్