సూర్యాపేట జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రేపు శుక్రవారం కోదాడ మండలం గుడిబండ దేవాలయం వద్ద నుండి కాపుగల్లు ఎక్స్ రోడ్డు వరకు నిర్వహించే రన్ ఫర్ యూనిటీ ర్యాలీలో భాగస్వాములు కావాలని కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి పురస్కరించుకొని నిర్వహించే జాతీయ ఐక్యత దినోత్సవం విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.