మోతె: రైతులకు నష్ట పరిహారం చెల్లించాలీ

తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మోతె మండలం సర్వారం లో తుఫాన్ కారణంగా నేలమట్టమైన పంట పొలాలను రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. ఐకెపి కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని తేమశాతం చూడకుండా కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శీలం సైదులు యాదవ్ కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్