మునగాల: ఎడమకాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

గురువారం మునగాల మండల పరిధిలోని బరాఖత్ గుడెం శివారులో సాగర్ ఎడమకాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి వయస్సు సుమారు 40-45 ఏళ్లు ఉండవచ్చని అంచనా వేశారు. మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రపరిచినట్లు, వివరాలకు 87128 88048, 9666692085 నంబర్లను సంప్రదించాలని స్థానిక ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్