నడి గూడెం: చలో హైదరాబాద్ కు పెన్షనర్లు తరలి రావాలి

పెండింగ్‌లో ఉన్న పెన్షనర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నడిగూడెం మండల అధ్యక్షుడు ఖలీల్ అహ్మద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 7న హైదరాబాద్‌లో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు ఆయన తెలిపారు. బుధవారం మండల కేంద్రంలో గోడపత్రికలను ఆవిష్కరించి, ఈ కార్యక్రమం గురించి నాయకులకు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలాజీ నాయక్, ఇబ్రహీం, అప్పిరెడ్డి, అంజయ్య, అనంతరాములు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్