నల్గొండ జిల్లా చిట్యాల వద్ద రైలు కింద పడి ఓ వివాహిత మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉరుమడ్లకు చెందిన రూపని స్వప్న (34) బుధవారం ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. కాగా ఇవాళ ఆమె మృతదేహాన్ని లోకో పైలట్ గుర్తించగా, పోలీసులు మృతదేహాన్ని నల్గొండ మార్చురీకి తరలించారు.