సూర్యాపేట: బతుకమ్మ సంస్కృతికి ప్రతీక.. కలెక్టర్

సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పూలను పూజించే సంస్కృతి తెలంగాణలోనే ఉందని, మహిళలు బతుకమ్మను అందంగా అలంకరించి, పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ పండుగను వైభవంగా జరుపుకోవడం కనువిందుగా ఉందని అన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. కలెక్టర్ సతీమణి కూడా మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు. కలెక్టరేట్ ప్రాంగణం అంతా బతుకమ్మ పాటలతో మారుమోగింది.

సంబంధిత పోస్ట్