నడిగూడెం ఎస్సై అజయ్ నేడు ఒక ప్రకటనలో మాట్లాడుతూ, సైబర్ నేరగాళ్లు ప్రభుత్వ ఏజెన్సీల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, లాటరీలు, రివార్డులు, డిస్కౌంట్ల పేరుతో సులభంగా డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపి మోసం చేస్తున్నారని తెలిపారు. మొబైల్‌కు వచ్చే OTP చెప్పవద్దని ప్రజలను అప్రమత్తం చేశారు.