లైసెన్స్డ్ సర్వేయర్లకు గౌరవ వేతనం: కలెక్టర్‌కు వినతి

సూర్యాపేట జిల్లా లైసెన్స్డ్ సర్వేయర్లు సోమవారం అదనపు కలెక్టర్ కె. సీతారామారావుకు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఐదు నెలల శిక్షణ అనంతరం ఉత్తీర్ణత సాధించి, లైసెన్సులు పొంది చాలా నెలలైనా విధుల్లోకి తీసుకోకపోవడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భూభారతి చట్టం అమలులో భాగంగా లైసెన్స్డ్ సర్వేయర్ల వ్యవస్థను బలోపేతం చేస్తూ భూ వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వారు హర్షించారు. తమ శ్రమకు తగ్గ ఫలితంగా నెలవారీ గౌరవ వేతనం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సర్వేయర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్