సూర్యాపేట రూరల్ పరిధిలోని ఎదురు వారి గూడెం, భీమవరం గ్రామాల మధ్య ఉన్న మూసీ నది వంతెనను జిల్లా ఎస్పీ నరసింహ శనివారం పరిశీలించారు. వరద ఉధృతి కారణంగా ప్రమాదాలు జరగకుండా సిబ్బందిని అప్రమత్తం చేశారు. మూసీ నది పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలను ప్రమాదం జరుగకుండా అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు.