రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించగా, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మరో 11 జిల్లాలు మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్ ఆరెంజ్ అలర్ట్, 5 జిల్లాలు కుమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్ ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రెడ్ అలర్ట్ జిల్లాలో తక్షణ సహాయ చర్యలకు కలెక్టర్లను సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.