సూర్యాపేట: పిడిఎస్యు ఆధ్వర్యంలో జంపాల వర్ధంతి

సూర్యాపేట పీడీఎస్యు కార్యాలయంలో బుధవారం కామ్రేడ్ జేసిఎస్ ప్రసాద్ వర్ధంతిని నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి మాట్లాడుతూ, కామ్రేడ్ జాజిరెడ్డి మరణానంతరం జంపాల విద్యార్థులను ప్రగతిశీల బాటలో నడిపించే ఆలోచనలను అందరికీ నూరిపోసి, కోదాడ వేదికగా పీడీఎస్యు విద్యార్థి ఉద్యమ ముసాయిదాను రూపొందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్