రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ సాయంత్రం 4 గంటల్లోపు ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడుతాయని భారత వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో గంటకు 41-61 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే హైదరాబాద్ సహా పలు జిల్లాల్లోనూ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.