యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్ కాలనీ వాసులు తమ రేషన్ షాప్ నెంబర్ 4408002 ఆరెగూడెంలో ఉండటంతో రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరానగర్ లోనే రేషన్ సరుకులు అందించాలని వారు కోరారు. ప్రజల విజ్ఞప్తి మేరకు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు రేషన్ షాప్ ను ప్రారంభించారు.