సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకోట గ్రామంలోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. శివునికి ప్రీతికరమైన కార్తీక మాసంలోని విశేషమైన పౌర్ణమి సందర్భంగా బుధవారం ఆలయంలో సహస్ర దీపోత్సవం నిర్వహించారు. దశాబ్ద కాలంగా ప్రతి ఏటా ఆలయంలో వైభవంగా కార్తీక దీపోత్సవాలు జరుగుతున్నాయి. గ్రామంలోని మహిళలు, భక్తులు విశేష సంఖ్యలో ఆలయానికి విచ్చేశారు.