సూర్యాపేట: ప్రజావాణిలో దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి

ప్రజావాణి దరఖాస్తులు అనేక శాఖలలో పెండింగ్ లో ఉన్నాయని, అక్టోబర్ నెలలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు తక్కువగా నిర్వహించారని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. కలెక్టరేట్ లో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కె. సీతారామారావు తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.

సంబంధిత పోస్ట్