మత్తు రహిత సమాజం కోసం ఉపాధ్యాయుడి వినూత్న ప్రచారం

సూర్యాపేట జిల్లాకు చెందిన తెలుగు ఉపాధ్యాయులు రాచకొండ ప్రభాకర్, మత్తుపదార్థాలు, గంజాయి, డ్రగ్స్ బారిన పడి జీవితాలు నాశనం చేసుకుంటున్న యువతలో చైతన్యం తెచ్చేందుకు 'మత్తు రహిత సమాజ స్థాపన' లక్ష్యంగా వినూత్న ప్రచారం నిర్వహించారు. నూతనకల్ మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్‌లో ఈ అవగాహన కార్యక్రమం చేపట్టారు. సెలవు రోజుల్లో ఖాళీ సమయాల్లో రాష్ట్రవ్యాప్తంగా జాతరలు, ఉత్సవాలు, సంతలు, రద్దీ ప్రాంతాల్లో గంజాయి, మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జనచైతన్యం కల్పిస్తున్నారు. చేతిలో మైక్ పట్టుకొని, ఫ్లెక్సీతో కూడిన విచిత్ర వేషధారణతో ప్రచారం నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి, క్రమశిక్షణతో మెలగాలని పోలీస్ హెడ్ కానిస్టేబుల్ నారాయణ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్