సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ నరసింహ పర్యటించి, పౌరులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ప్రమాదాలు జరిగే కూడళ్లలో నియంత్రిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ నాగేశ్వరరావు, ఎస్సై వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.