ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.1197 కోట్ల నికర నష్టాన్ని నమోదుచేసింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ రూ.611 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేయగా.. ఏడాదిలో నష్టాలు దాదాపు రెట్టింపయ్యాయి. సమీక్షా త్రైమాసికంలో స్విగ్గీ మొత్తం ఆదాయం కూడా రూ.3,310 కోట్ల నుంచి రూ.5,048 కోట్లకు పెరిగింది. తాజా ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో స్విగ్గీ షేరు 0.62 శాతం లాభంతో రూ.403 వద్ద ముగిసింది.