తమిళనాడు BJP చీఫ్ అన్నామలైకు చేదు అనుభవం ఎదురైంది. 51వ షూటింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలకు BJP చీఫ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో పరిశ్రమలశాఖ మంత్రి TRB రాజా కుమారుడు సూర్య రాజ బాలు ఆయన నుంచి మెడల్ తీసుకునేందుకు తిరస్కరించాడు. అన్నామలై మెడల్‌ను అతడి మెడలో వేసేందుకు ప్రయత్నించగా అతడు నిర్మొహమాటంగా తిరస్కరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.