జీఎస్టీ తగ్గింపుతో వచ్చిన లాభాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తూ టాటా మోటార్స్ కార్ల ధరలు భారీగా తగ్గించింది. టియాగోపై రూ.75 వేలు, టిగోర్‌పై రూ.80 వేలు, ఆల్ట్రోజ్‌పై రూ.1.10 లక్షలు, నెక్సాన్‌పై రూ.1.55 లక్షల తగ్గింపు అమలులోకి రానుంది. హారియర్, సఫారీపై వరుసగా రూ.1.40 లక్షలు, రూ.1.45 లక్షల తగ్గింపు ఉంటుంది. ఈ ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి.