ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 14 మంది లోక్‌సభ, ఇద్దరు రాజ్యసభ ఎంపీలు ఓటు వేశారు. మరోవైపు తెలంగాణ బీజేపీ ఎంపీలు సైతం ఓటు వేశారు. వీరిలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు రఘునందన్ రావు, ఈటల, డీకే అరుణ తదితరులున్నారు.