ఏసీ కోచ్‌లో టికెట్ లేకుండా ప్రయాణించిన బీహార్ ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఇష్యూ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీసీ టికెట్ చూపించమని అడగగా.. ఆమె “నన్ను వేధిస్తున్నావు” అంటూ రివర్స్ అయ్యింది. ఆమె గతంలో కూడా టికెట్ లేకుండా ప్రయాణిస్తుందని టీటీఈ గుర్తు చేశారు. ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగింది. చివరకు ఆమె తన బ్యాగ్ తీసుకుని వెళ్లిపోయింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు టీచర్ ప్రవర్తనపై తీవ్రంగా మండిపడుతున్నారు.