AP: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఆ ఉపాధ్యాయురాలు వారితో కాళ్ళు నొక్కించుకుంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగుచూసింది. ఉపాధ్యాయురాలు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ.. ఇద్దరు విద్యార్థినులతో కాళ్ళు నొక్కించుకుంటున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఉన్నతాధికారులు ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసులు ఇచ్చి.. విచారణకు ఆదేశించారు.