టీమ్‌ఇండియా జెర్సీ ధర భారీగా పడిపోయింది. ఇటీవల స్పాన్సర్‌గా డ్రీమ్ 11 తప్పుకున్న కొద్ది రోజులకే ధరలు దాదాపు 80% తగ్గాయి. అసలు ధర రూ.5999 ఉన్న టీ20 ఇంటర్నేషనల్ జెర్సీ ప్రస్తుతం అడిడాస్ అధికారిక వెబ్‌సైట్‌లో కేవలం రూ.1199కే లభిస్తోంది. ఇదే ధరకు ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ టెస్ట్ జెర్సీ కూడా అందుబాటులో ఉంచారు. ధరలు ఇంత తగ్గించడానికి కారణాన్ని మాత్రం అడీడాస్ వెల్లడించలేదు.