ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. భారత్‌కు 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినా.. ఆ ఫలాలు పొందడానికి తెలంగాణకు మరో 13 నెలలు పట్టిందన్నారు. నిజాం నిరంకుశ పాలనపై సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో సాగిన పోలీస్ యాక్షన్ మూలంగా తెలంగాణకు స్వేచ్ఛ దక్కి విమోచన కలిగిందన్నారు.