ఉన్నత విద్యా కాలేజీలకు షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

TG: ఉన్నత విద్యా కాలేజీలకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో తెలంగాణ ప్రభుత్వం ఇంజినీరింగ్ సహా ఉన్నత విద్యా కాలేజీలకు విజిలెన్స్ తనిఖీలకు ఆదేశించింది. పోలీస్, విద్యాశాఖ అధికారుల సహకారంతో తనిఖీలు చేపట్టి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. మరోవైపు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆరోపిస్తూ ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు నవంబరు 3 నుంచి కాలేజీలను మూసివేస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్