మహిళలపై నేరాల్లో తెలంగాణ టాప్.. ఎన్‌సీఆర్‌బీ నివేదిక

ఎన్‌సీఆర్‌బీ తాజా నివేదిక ప్రకారం 2023లో దేశవ్యాప్తంగా మహిళలపై 4.48 లక్షల నేరాలు నమోదయ్యాయి. మహిళలపై నేరాల రేటులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. తెలంగాణలో ప్రతి లక్ష మంది మహిళలకు 124.9 నేరాలు నమోదయ్యాయి. ఈ జాబితాలో రాజస్థాన్ (114.8), ఒడిశా (112.4), హర్యానా (110.3), కేరళ (86.1) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే, అత్యధిక సంఖ్యలో కేసులు నమోదైన రాష్ట్రంగా యూపీ (66,381) మొదటి స్థానంలో ఉంది.

సంబంధిత పోస్ట్