మహిళా న్యాయమూర్తుల సంఖ్యలో తెలంగాణ హైకోర్టు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణలో మొత్తం 30 మంది జడ్జిల్లో 10 మంది మహిళలు ఉండగా, సిక్కిం హైకోర్టు రెండో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఐదుగురు మహిళా జడ్జిలతో 9వ స్థానంలో ఉంది. సుప్రీంకోర్టులో 33 మందిలో కేవలం ఇద్దరు మాత్రమే మహిళలు ఉన్నారని సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ రిసెర్చ్ నివేదిక వెల్లడించింది.