నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి ప్రత్యేక విమానం ఏపీలోని విశాఖపట్నంకు చేరుకుంది. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులతో 6E 9511 విమానం చేరుకుంది. దీనిలో 144 మంది తెలుగు యాత్రికులు ఉండగా.. వారిలో 104 మంది విశాఖ వాసులు ఉన్నారు. మిగిలిన 40 మందితో విమానం తిరుపతి వెళ్లనుంది. నేపాల్‌లో అల్లర్లు కారణంగా అక్కడ చిక్కుకున్న తెలుగువారిని మంత్రి లోకేశ్ చొరవతో ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు.