TG: హైదరాబాద్‌లోని విధ్యుత్ శాఖ ADE అంబేద్కర్ బినామీ సతీష్ ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. ఏసీబీ నిర్వహించిన సోదాల్లో సతీష్ ఇంట్లో రూ.2 కోట్ల నగదును గుర్తించారు. దీంతో మరింత లోతుగా అంబేద్కర్ బినామీ ఇళ్లల్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఏకకాలంలో మొత్తం 18 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. రూ.200 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. భారీగా ఆస్తులు, వ్యవసాయ భూముల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.