TG: గణేశ్ నిమజ్జన ఉత్సవాల సందర్భంగా మెట్రో ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త చెప్పింది. శనివారం అన్ని మెట్రో స్టేషన్‌ల నుంచి ఉదయం 6 గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైలు అందుబాటులో ఉండనుంది. సాధారణంగా వీకెండ్స్‌లో ఉదయం ఏడు గంటలకు మొదలై.. రాత్రి 11 గంటలకు ఆఖరి మెట్రో రైలు అందుబాటులో ఉండేది. హైదరాబాద్‌లో ఘనంగా జరిగే గణేశ్ నిమజ్జన వేడుకలకు భక్తులు అధికసంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.