నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన బాలయ్య(77)ను గురువారం తన కొడుకు బీరయ్య దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఆస్తి కోసం హత్య చేసి తల, మొండెం వేర్వేరు చోట్ల పడేశాడు. శుక్రవారం ఉప్పునుంతల మండలం కొరటికల్ వాగులో మొండెం లభ్యం కాగా, శనివారం సాయంత్రం వంగూరు మండలం డిండి చింతపల్లి వాగులో తల లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.