శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అలయన్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఆదివారం సాంకేతిక లోపం తలెత్తింది. మూడుసార్లు రన్‌వై పైకి వెళ్లి సాంకేతిక లోపం కారణంగా పైలట్ అప్రమత్తమై ఫ్లైట్‌ను నిలిపేశాడు. కాగా ఈ విమానం శంషాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సి ఉంది. ఫ్లైట్ ఆలస్యం కావడంతో అందులో ఉన్న 37 మంది ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు అహ్మదాబాద్ విమాన ఘటన తర్వాత ఎయిర్ లైన్స్ సంస్థలకు డీజీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.